భారతదేశం, డిసెంబర్ 21 -- ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలే వచ్చాయి. కొత్త జోష్ తో ఓటీటీలు సందడి చేస్తున్నాయి. ఇందులో అన్ని భాషల సినిమాలున్నాయి. థ్రిల్లర్లు కూడా వచ్చాయి. ఈ థ్రిల్లర్లలో ఓ మలయాళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. అదే.. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇందులో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు.

మమ్ముట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఓటీటీలో సత్తాచాటుతోంది. ఇది జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ డిసెంబర్ 19న ఓటీటీలో రిలీజైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఆడియన్స్ తెగ లైక్ చేస్తున్నారు.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ థియేటర్లో రిలీజైన 10 నెలల తర్వాత ఓటీటీలోకి...