భారతదేశం, జూన్ 28 -- థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. ఈ మూవీ రీసెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సత్తాచాటుతోంది. ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.4గా ఉంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.

థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న 'ఒక పథకం ప్రకారం' సినిమా జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'.

వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థల...