భారతదేశం, మే 10 -- తెలుగు హీరో నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం మార్చి 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో షాలినీ హీరోయిన్‍గా నటించారు. పొలిమేరతో పాపులర్ అయిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు కావటంతో ఈ మూవీకి మంచి బజ్ వచ్చింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ ఓటీటీలో 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం అదరగొడుతోంది.

28 డిగ్రీ సెల్సియస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో టాప్-5లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల ట్రెండింగ్ జాబితాలో ఐదో ప్లేస్‍లో ఈ మూవీ నిలిచింది.

ఏప్రిల్ 29న 28 డిగ్రీ సెల్సియస్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రమంగా వ్య...