భారతదేశం, జూన్ 5 -- ఓటీటీలో ఓ చిన్న సినిమా అదరగొడుతోంది. థియేటర్లను షేక్ చేసిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. రివేంజ్ థ్రిల్లర్ తుడరుమ్ ను వెనక్కినెట్టి ఈ ఫ్యామిలీ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ సినిమానే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ చిన్న సినిమా ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది. ఓటీటీని ఏలుతోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు సైలెంట్ గా వచ్చింది. కానీ ఆ తర్వాత కలెక్షన్లతో అదరగొట్టింది. రూ.8 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ మూవీ.. సుమారు రూ.87.87 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెను ప్రకంపనలే సృష్టించింది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి దిగ్గజాలు ఈ మూవీని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

థియేటర్లను షేక్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ 2న ఓట...