భారతదేశం, జూన్ 17 -- తెలుగు హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఎలెవెన్ (లెవెన్) చిత్రం మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. మిస్టరీగా మారిన మర్డర్ల ఇన్వెస్టిగేషన్ చుట్టు ఈ సినిమా సాగుతుంది. థియేట్రికల్ రన్‍లో పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం పెద్దగా రాలేదు. ప్రస్తుతం ఓటీటీలో ఈ ఎలెవెన్ చిత్రం దుమ్మురేపుతోంది.

ఎలెవెన్ చిత్రం తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల విభాగంలో ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‍లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. తెలుగు వెర్షన్ ప్రస్తుతం ఆరో ప్లేస్‍లో ఉంది. ఎలెవెన్ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ఎలెవెన్ సినిమా జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియో ...