భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఎన్నో అంచనాలతో, భారీ హైప్ తో థియేటర్లకు వచ్చిన మూవీ 'కన్నప్ప'. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోర్లా పడింది. సినిమా నిండా స్టార్లు ఉన్నా ఈ చిత్రానికి ఆడియన్స్ ను నుంచి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. దీంతో మంచు విష్ణు కలల సినిమాకు షాక్ తప్పలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.

మంచు విష్ణు లీడ్ రోల్ ప్లే చేసిన 'కన్నప్ప' మూవీ సెప్టెంబర్ 4న ఓటీటీలో రిలీజైంది. రెండు రోజుల కింద డిజిటల్ స్ట్రీమింగ్ డెబ్యూ చసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్ లో ఈ మూవీ టాప్-2లో ఉంది. హిందీ గ్యాంగ్ స్టర్ క్రైమ్ థ్రిల్లర్ మాలిక్ తర్వాత కన్నప్ప సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

శివ భక్తుడైన కన్న...