Hyderabad, అక్టోబర్ 6 -- మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలుసు కదా. బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. అతని లేటెస్ట్ హిట్ హృదయపూర్వం థియేటర్లలోనే కాదు ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

ఓటీటీలో ప్రతివారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 మధ్య కూడా జాబితాను సోమవారం (అక్టోబర్ 6) రిలీజ్ చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.

వీటిలో టాప్ ప్లేస్ లో ఉన్న సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గతవారం 3 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది.

ఇక నెట్‌ఫ్లిక్స్ లోన...