Hyderabad, మే 8 -- జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి త్వరలోనే క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ రాబోతోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సిరీస్. అయితే ఇది వచ్చే ముందే కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాల్సినవి ఉన్నాయి. ఒకవేళ వీటిని ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి. నిజానికి తక్కువ మందికే ఈ సిరీస్ గురించి తెలుసు. కానీ చూస్తే మాత్రం మంచి థ్రిల్ గ్యారెంటీ.

ముర్షిద్ గతేడాది ఆగస్ట్ లో జీ5 ఓటీటీలోకి వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్రముఖ బాలీవుడ్ నటుడు కేకే మేనన్ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ముర్షిద్ పఠాన్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అతడు నటించాడు. చాలా రోజుల కిందటే అండర్‌వరల్డ్ వదిలేసి వెళ్లిన అతడు.. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మరోసారి అందులోకి దిగాల్సి వస్తుంది. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సిరీస్ ...