భారతదేశం, ఆగస్టు 20 -- మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మలయాళం సినిమాలంటేనే కంటెంట్ బాగుంటుందనే టాక్ ఉంది. ఇక ఇందులోనూ మమ్ముట్టి ఎంచుకునే సబ్టెక్ట్ లు, ఆయన యాక్టింగ్ వేరే లెవల్. క్రైమ్, హారర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా ఏ జోనర్ అయినా తన స్టైల్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తారు మమ్ముట్టి. ఆయన సినిమాల్లోని బెస్ట్ థ్రిల్లర్లు ఇక్కడున్నాయి. అవి ఏ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.

మనవ మెదడులోని సమస్యల కారణంగా, ఆశ చుట్టూ తిరిగే మానవ వ్యక్తిత్వం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో చూసే చిత్రమే 'భ్రమ యుగం'. ఈ హారర్ థ్రిల్లర్ లో మమ్ముట్టి వన్ మ్యాన్ షో ఉంటుంది. రహస్యంగా ఉండే ఓ పాడుబడ్డ బంగ్లాలోకి ఓ ఫోక్ సింగర్ వస్తాడు. అక్కడే ఉంటున్న మమ్ముట్టి దగ్గర ఇరుక్కుపోతాడు. మమ్ముట్టి క్యారెక్టర్ అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చి...