భారతదేశం, ఆగస్టు 12 -- థ్రిల్, సస్పెన్స్, రొమాన్స్, బోల్డ్.. ఇలా అన్నీ ఒకే సిరీస్ లో కావాలా? ఒక్కసారి చూడటం మొదలు పెడితే కంటిన్యూ చేసేలా వెబ్ సిరీస్ ఉండాలా? అయితే ఈ సిరీస్ ను కచ్చితంగా చూసేయండి. 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' (Tribhuvan Mishra CA Topper) సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో దుమ్ము రేపుతోంది.

బోల్డ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. 2024 జులై 18న ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. ఈ వెబ్ సిరీస్ లో 9 ఎపిసోడ్లున్నాయి. ఇందులో మానవ్ కౌల్, తిలోత్తమ షోమ్, శుభ్రజ్యోతి బరత్, నైనా సరీన్, శ్వేతా బసు ప్రసాద్ కీ రోల్స్ ప్లే చేశారు. అమృత్ రాజ్‌ గుప్తా దీనికి డైరెక్టర్.

బోల్డ్ థీమ్ తో త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ వెబ్...