భారతదేశం, డిసెంబర్ 9 -- ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తమిళ వెబ్ సిరీస్ పేరు కుట్రమ్ పురింధవన్ (Kuttram Purindhavan). ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పశుపతి, లిజీ ఆంటోనీ, విదార్థ్ లాంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ చూడొచ్చు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి. మరి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలో తెలుసుకోండి.

ఇదొక కనిపించకుండా పోయిన 12 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ. ఒక దారుణమైన నేరం చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఎపిసోడిక్ ఫార్మాట్‌లో సాగే ఈ కథనం తర్వాతి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతుంది. దీంతో వరుసబెట్టి అన్ని ఎపిసోడ్లను ఒకేసారి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. తొల...