భారతదేశం, నవంబర్ 17 -- ఓటీటీలో అన్ని జానర్లలో హారర్ థ్రిల్లర్ ప్రత్యేకం. వీటికి కాస్త ఎక్కువ మందే అభిమానులు ఉంటారు. భయంతోపాటు థ్రిల్ కూడా అందించే ఇలాంటి వెబ్ సిరీస్, షోస్ చాలానే ఉన్నాయి. ఈ మధ్యే ప్రైమ్ వీడియోలో విడుదలైన 'అంధేరా' వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇది చాలానే భయపెట్టింది.

వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇలాంటి మరిన్ని హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, షోస్ ఇంకా ఏం ఉన్నాయి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఈ అన్నింటినీ చూడొచ్చు.

ఈ వెబ్ సిరీస్ లో టిస్కా చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. సిలాస్పూర్ అనే కల్పిత గ్రామంలోని మూఢ నమ్మకాలు, సైన్స్ మధ్య జరిగే సంఘర్షణను ఇది చూపిస్తుంది. ఐఏఎస్ అధికారి అవని రౌత్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించడానికి గ్రామానికి ర...