Hyderabad, మే 23 -- ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పేరు హంట్. అయితే ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు కావడంలో ఆలస్యం కావడంతో ఏకంగా 9 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ప్రముఖ నటి భావన ఇందులో లీడ్ రోల్లో నటించింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన మూవీ ఇది.

మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ హంట్ (Hunt) శుక్రవారం (మే 23) మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన హంట్ మూవీ గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. భావన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మనోరమ మ్యాక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడా మూవీని తమ ఓటీటీలోకి తీసుకొచ్చింది.

హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఓసారి ఈ హంట్ మూవీ చూడొచ్చు. గతంలో రెడ్ చిల్లీస్, నట్ట...