Hyderabad, ఏప్రిల్ 29 -- ఐశ్వర్య రాజేష్ 2016లో తమిళంలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆరత్తు సినమ్. అంటే కోపం చల్లారదు అని అర్థం. ఈ మూవీకి దృశ్యం ఫ్రాంఛైజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కథ అందించడం విశేషం. ఇప్పుడీ మూవీ 9 ఏళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. హనుమాన్ మీడియా ఈ మూవీని తెలుగులో తీసుకువచ్చింది.

ఐశ్వర్య రాజేష్ నటించిన మూవీ ఆరత్తు సినమ్ సినిమాను తెలుగులో గరుడ 2.0గా తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడీ సినిమాను తీసుకురావడం విశేషం.

గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి సినిమాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత ఇతడు. తమిళంలో సూపర్...