భారతదేశం, ఆగస్టు 30 -- ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.788 కోట్లు కొల్లగొట్టిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది నేకెడ్ గన్' మూవీ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. 73 ఏళ్ల వయసులో రొమాన్స్, యాక్షన్ తో అదరగొట్టాడు హీరో లియాం నీసన్. ఈ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో చూద్దాం.

లియాం నీసన్ నటించిన ది నేకెడ్ గన్ సినిమా త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. పారమాంట్ నిర్మించిన ఈ కామెడీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు డిజిటల్‌గా విడుదల కానుంది. యుఎస్ఏ టుడే ప్రకారం ఈ మూవీ సెప్టెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం అప్పటి నుంచి సాధ్యమవుతుంది.

డిజిటల్ కొనుగోలుదా...