Hyderabad, ఆగస్టు 8 -- అహాన్ పాండే, అనీత్ పడా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా సయ్యారా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న్యూస్ 18 నివేదిక ప్రకారం, సయ్యారా సినిమా ఇప్పటికే భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథా చిత్రంగా పేరు తెచ్చుకుంది.

జూలై 18న థియేటర్లలో సైలెంట్‌గా విడుదలైన ఈ హిందీ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని నెలలకే డ్రాప్ అవుతుందని భావించిన ఈ సినిమా రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 478 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత మొత్తంగా రూ. 500 కోట్ల మార్క్ కలెక్షన్స్ దాటేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా సయ్యారా రికార్డ్ కొట్టేసింది. అంతేకాకుండా ఈ సినిమా చూసిన వారంతా సయ్యారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్లలో ఆడియెన్స్‌ను కన్నీళ్లు పెట్టిస్తు...