Hyderabad, ఆగస్టు 10 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. హారర్, యాక్షన్, క్రైమ్, కామెడీ జోనర్లలో ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, మనసుకు హత్తుకునే అంశాలతో వచ్చే సినిమాలు చాలు తక్కువ. అలాంటి ఓ సినిమానే ఓటీటీలోకి ఇంకో నాలుగు రోజుల్లో రానుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ ట్రావెల్ డ్రామా చిత్రం మితాడ మహేమన్. నిజానికి ఇది ఒక గుజరాతీ ఫిల్మ్. మితాడ మహేమన్ అంటే తెలుగులో మధురమైన అతిథి (స్వీట్ గెస్ట్). సినిమా పూర్తయ్యేసరికి హీరో జీవితంలోకి నిజంగానే మధురమైన అతిథులు వచ్చి ఉంటారు. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్‌గా పెట్టారు.

సూసైడ్ చేసుకోవాలని హీరో తెగ ప్లాన్ చేస్తుంటాడు. కానీ, ఫెయిల్ అవుతాయి. అయితే, రోడ్ ట్రిప్ వేసి ఎవరు లేని చోట ప్రశాంతంగా ఆత్మహత్య చేయాలని ట్రావెల్ ప్లాన్ వేసుకుంటాడు హీరో. ఆ ట్రావెల్ జర్నీలో సూసైడ్ చే...