భారతదేశం, నవంబర్ 9 -- ఓటీటీలోకి నాలుగు కొత్త సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సినిమాలు 3 రోజుల గ్యాప్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నా ఆ లేటెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తెలుసు కదా. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారిన సినిమా ఇది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన తెలుసు కదా సినిమా యావరేజ్‌గా ఆడింది. అయితే, సినిమా టేకింగ్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి.

ఈ నెలలో వచ్చే వారమే తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుసు కదా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఇవాళ (నవంబర్ 9)న తెలుసు కదా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్...