భారతదేశం, జనవరి 3 -- న్యూ ఇయర్ 2026లో ఓటీటీలో కొత్త సరుకు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇప్పుడు వరుసగా సినిమాలు, సిరీస్ లు వరుస కడుతున్నాయి. ఇందులో గతేడాది ప్రపంచాన్ని వణికించిన హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' కూడా రాబోతుంది. ఈ భయంకర సినిమా థియేటర్లలో ఆడియన్స్ ను హడలెత్తించింది.

జాక్ క్రెగర్ దర్శకత్వంలో వచ్చిన 'వెపన్స్' (Weapons) సినిమా విడుదలైన తర్వాత నిరాశపరచలేదు. దీనికి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా ఆడింది. ప్రపంచవ్యాప్తంగా $260 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా భారతదేశంలో ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

హారర్ థ్రిల్లర్ వెపన్స్ మూవీ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తోంది. ఈ హాలీవుడ్ మూవీ జనవరి 8 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెపన్స్ ఓ...