భారతదేశం, డిసెంబర్ 9 -- తెలుగులో చిన్న బడ్జెట్ మూవీ ఒకటి నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతోంది. మరో రెండు రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ మూవీ పేరు కలివి వనం.

బిత్తిరి సత్తితోపాటు రఘు బాబు, నాగదుర్గలాంటి వాళ్లు నటించిన మూవీ ఈ కలివి వనం. ఈ సినిమాను గురువారం (డిసెంబర్ 11) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "అడవి కోసం చేసే పోరాటం.. రక్షించుకోదగిన వారసత్వం.. మిమ్మల్ని కదిలించే కథ. కలివి వనం డిసెంబర్ 11 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

కలివి వనం మూవీకి రాజ్ నరేంద్ర కథ అందించి, డైరెక్ట్ చేశాడు. ఇందులో నాగదుర...