భారతదేశం, డిసెంబర్ 1 -- హ్యాపీడేస్ సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అనంతరం కుర్రాడు, మరో చరిత్ర, ఇందువదన, నింద, విరాజి వంటి చిత్రాలతో అలరించాడు వరుణ్ సందేశ్.

ఈ ఏడాది రాచరికం సినిమాలో కనిపించాడు వరుణ్ సందేశ్. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ ఓటీటీ సిరీసే నయనం.

ఇప్పటికే భిన్నమైన జోనర్స్‌తో అలరించిన వరుణ్ సందేశ్ మరోసారి విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో రానున్నట్లు తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కున్న నయనం వెబ్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మ‌నుషుల్లోని నిజ స...