భారతదేశం, డిసెంబర్ 9 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ డ్రామా సిరీస్ 'ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్' (Freedom At Midnight) రెండో సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మొదటి ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మొదటి సీజన్ కంటే మరింత ఉద్వేగభరితమైన, ఉద్రిక్తమైన సన్నివేశాలతో ఈ సీజన్ ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. "మీరు తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర" అంటూ మేకర్స్ ఈ సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సీజన్ దేశ విభజన, దాని తాలూకు రక్తపాతం చుట్టూ తిరగనుంది.

ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్.. గతేడాది చివర్లో సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ఇది. దేశ స్వాతంత్య్రోద్యమం చుట్టూ తిరుగుతూ ఇప్పటి వరకూ తెలియని చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ తో రానుంది.

దీనికి సంబంధించిన ట్రైలర్‌...