భారతదేశం, నవంబర్ 19 -- బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రాబోయే జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ 'మిసెస్ దేశ్‌పాండే'తో మరోసారి బుల్లితెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఆమె ఓ చిన్న టీజర్ ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇది ఎవరూ ఊహించని ఓ ట్విస్టుతో ఆసక్తి రేపుతోంది.

బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో ఓటీటీలోకి వస్తోంది. బుధవారం (నవంబర్ 19) నాడు మాధురి తన సోషల్ మీడియాలో 20 సెకన్ల టీజర్‌ను షేర్ చేసింది. ఈ క్లిప్‌లో మాధురి తన నగలు, మేకప్ ను తొలగిస్తూ కనిపిస్తుంది.

అయితే ఈ సీన్ అకస్మాత్తుగా ఆగిపోయి.. ఆమె జైలు యూనిఫాంలో, నవ్వుతూ ఉండే భయానక సీన్ తెరపైన కనిపిస్తుంది. ఈ టీజర్ మాధురీ దీక్షిత్ ను భయపెట్టే సీరియల్ కిల్లర్ గా, ఓ బోల్డ్ అవతార్‌లో చూపిస్తుంది. ఇది ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్రగా నిలవనుంది.

అంతక...