Hyderabad, సెప్టెంబర్ 1 -- ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సెప్టెంబర్‌లో సరికొత్త కొరియన్ డ్రామాలతో థ్రిల్ పంచనుంది. కె-డ్రామాలో ఎంతో హిట్ కొట్టిన ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. సెప్టెంబర్ 2025లో ఓటీటీ రిలీజ్ అయ్యే కె-డ్రామాలను తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ రిలీజ్ డేట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కొరియన్ డ్రామాలో వచ్చే అతిపెద్ద సినిమా మాంటిస్. సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో మాంటిస్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇది కిల్ బోక్సూన్ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ఇమ్ సి వాన్, పార్క్ గ్యూ యంగ్, జో వూ జిన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. లీ టే సంగ్ దర్శకత్వం వహించారు.

సుమారు 15 ఎపిసోడ్లతో ప్రసారం కానున్న కొరియన్ మెలో డ్రామా యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ...