భారతదేశం, నవంబర్ 17 -- రేసింగ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సినిమా ఇది. థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ ఎంజాయ్ చేసే మూవీ ఇది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన 'ఎఫ్1' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఫార్ములా వన్ (ఎఫ్1) రేసుల గురించి తెలిసిన ప్రేక్షకులకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చే అవకాశముంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ ప్లే చేశాడు.

బ్రాడ్ పిట్ లీడ్ రోల్ లో నటించిన 'ఎఫ్1' రేసింగ్ డ్రామా కోసం అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది, ముఖ్యంగా దాని డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అసలైన ఎఫ్1 ఈవెంట్లలో చిత్రీకరించిన వాస్తవిక రేసింగ్ సన్నివేశాలతో, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది డిసెంబర్ 12న ఓటీటీలోకి రానుంది. ఆపిల్ టీవీ ప్లస్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎఫ్1 మూవీని చూడ...