భారతదేశం, అక్టోబర్ 27 -- ఇటీవల కన్నడ నాట విడుదలై భారీ హిట్ అందుకున్న సినిమా కాంతార చాప్టర్ 1. 2022లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార 2 అంతకుమించిన సక్సెస్ కొట్టింది. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించారు.

కాంతార చాప్టర్ 1 సినిమాలో రిషబ్ శెట్టితోపాటు బ్యూటిఫుల్ రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, దీపక్ రాయ్, రాకేష్ పూజారి, పూరి ప్రశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించి రూపొందించారు.

అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన కాంతార చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. కన్నడతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. త్వరలో అక్టోబర్ ...