Hyderabad, మే 1 -- ఓటీటీలో తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన వెబ్ సిరీస్ హార్ట్ బీట్ (Heart Beat). ఇదొక మెడికల్ డ్రామా. తొలి సీజన్లో ఏకంగా 100 ఎపిసోడ్ల పాటు షోని నడిపించారు. గతేడాది మార్చిలో మొదట తమిళంలో రిలీజైన ఈ సిరీస్.. తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ త్వరలోనే రాబోతోంది.

గతేడాది హార్ట్ బీట్ వెబ్ సిరీస్ మొదట తమిళంలో స్ట్రీమింగ్ అయిన తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే రెండో సీజన్ మాత్రం ఒకేసారి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. హార్ట్ బీట్ రిథమ్ ఆఫ్ లైఫ్ సీజన్ 2 త్వరలోనే రాబోతోందంటూ జియోహాట్‌స్టార్ ఓటీటీ గురువారం (మే 1) ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

"బీట్ డ్రాపవుతుంది. డ్రామా మొదలవుతుంది. కొత్త రిథమ్ ఫీలవడానికి సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఆ వీడియో రిలీజ్ చేశారు. అందులో డాక్టర్ రీనా.. ఓ సీనియర్ డా...