Hyderabad, జూన్ 30 -- తమిళ కామెడీ మూవీ ఒకటి ఈవారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు మద్రాస్ మ్యాటినీ (Madras Matinee). జూన్ 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎండీబీలో 9.4 రేటింగ్ ఉంది. ఇక ఇప్పుడు శుక్రవారం (జులై 4) డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ఓటీటీలోకి రాబోతున్న తమిళ కామెడీ సినిమా పేరు మద్రాస్ మ్యాటినీ. ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీ జులై 4 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సోమవారం (జూన్ 30) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"అతడు చేసే ప్రతి ప్రయాణం, అతడు చేసే ప్రతి త్యాగం.. తన కుటుంబం కోసమే. మద్రాస్ మ్యాటినీ స్టోరీ మాత్రమే కాదు.. తన పిల్లలు పెద్ద కలలు కనడానికి తన కలలను పక్కన పెట్టే తండ్రికి ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్" అనే క్యాప్షన్ తో ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసి...