భారతదేశం, నవంబర్ 4 -- కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ కమరొ 2 (Kamaro 2). గతంలో కమరొట్టు చెక్‌పోస్ట్ పేరుతో వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.

కమరొ 2 మూవీ ఓ కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. 2019లో వచ్చిన కమరొట్టు చెక్‌పోస్ట్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

"కమరొట్టు చెక్ పోస్ట్ దగ్గర టెర్రర్ మళ్లీ నిద్ర లేచింది.. ఈసారి మరింత భయానకంగా, ప్రమాకరంగా మారింది. కమరో 2 నవంబర్ 7 నుంచి సన్ నెక్ట్స్ లో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్...