Hyderabad, సెప్టెంబర్ 4 -- కన్నడ సూపర్ హిట్ యాక్షన్ డ్రామా కోత్తలవాడి (Kothalavadi) డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమాకు ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.

కోత్తలవాడి ఓ కన్నడ రూరల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ఈ మూవీ డైరెక్టర్ పుష్ప అరుణ్‌కుమార్ ఈ సినిమా ఐదు భాషల హక్కులను ప్రైమ్ వీడియోకి ఇచ్చినట్లు వెల్లడించాడు.

దీంతో ఇప్పుడీ కోత్తలవాడి కన్నడతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్త...