Hyderabad, ఏప్రిల్ 28 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి (Agnyathavasi). ఈ కన్నడ మూవీ ఈ నెల 11నే థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అసలు సినిమా కథేంటన్న వివరాలు చూద్దాం.

జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. మే 16 నుంచి జీ5లోకి ఈ సినిమా రానుంది. అయితే ఈ మధ్యకాలంలో జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్న సినిమాలు ఒకేసారి ఇటు ఓటీటీ, అటు టీవీలోకి వస్తున్నాయి.

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మ్యాక్స్, వెంకటేశ్ సం...