భారతదేశం, ఆగస్టు 31 -- డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. మరికొద్ది రోజుల్లో సూపర్ నేచురల్ మిస్టరీ సిరీస్ రెండో సీజన్ పార్ట్ 2లోని మిగిలిన నాలుగు ఎపిసోడ్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయింది. ఆగస్టు 6 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 2 పార్ట్ 1 కూడా ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఇప్పుడు సీజన్ 2 పార్ట్ 2 రాబోతోంది. ఈ పార్ట్ 2 సెప్టెంబర్ 3 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల న్యూయార్క్ నగరంలో నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై గ్రాండ్ గాలా సందర్భంగా సింగర్ లేడీ గాగా ...