Hyderabda, అక్టోబర్ 14 -- ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ జోనర్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇదంతా ఎక్కువగా మొదలైంది దృశ్యం సినిమాతో అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ జోనర్స్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ దృశ్యం అండ్ దృశ్యం 2.

ఈ రెండు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ దృశ్యం సిరీస్‌తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన దృశ్యం 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, దృశ్యం 3 కంటే ముందుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది.

ఆ మూవీనే మిరాజ్. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. హీరో సూర్య నటించిన ఆకాశమే హద్దురా సినిమాతో అపర్ణ బాలమురళి తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. జీతూ జోసెఫ్, అపర్ణ బాలమురళ...