Hyderabad, అక్టోబర్ 4 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు తెలుగులో కూడా సరికొత్త కంటెంట్స్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని భాషలతో పోటీ పడుతూ తెలుగులో కూడా విభిన్నమైన కంటెంట్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతుంటాయి.

అలా సరికొత్తగా తెలుగులో ఓటీటీలోకి రానున్న మైథలాజికల్ కామెడీ థ్రిల్లర్ సినిమా చిరంజీవ. ఈ సినిమా గురించి ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. తాజాగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోకు ఎదుటి మనుషుల ఆయుష్షు చూసే పవర్ లభిస్తుంది. దాంతో ఎదుటి వాళ్లు ఎన్నేళ్లు బతుకుతారో చెప్పగలడు.

అయితే, ఈ పవర్ ధన త్రయోదశి నాడు యమ ధర్మరాజుకు పూజ చేయడంతో లభించినట్లు హీరో తల్లి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ చేయగా.. హీరోయిన్‌గా సోషల్ మీడియా బ్యూటీ కుషిత కల్లపు చేసింది. తొలిసారిగా రాజ్ తరుణ్, క...