Hyderabad, సెప్టెంబర్ 28 -- ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్ వస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలా ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అదే గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ సిరీస్‌లో జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ సిరీస్‌ను నిర్మించారు.

నిజానికి ఫన్ కోసం ఆటలు ఆడాలి. కానీ, అదే ఆట ఆడుతుంటే నిజ జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరికొత్త తమిళ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. వర్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు నిజ...