Hyderabad, ఆగస్టు 18 -- ఓటీటీ కొరియన్ డ్రామాలకు వరల్డ్ వైడ్‌గా ఎంతో క్రేజ్ ఉంది. కొరియిన్‌లో వచ్చే రొమాంటిక్, డ్రామాలను పక్కన పెడితే యాక్షన్ లవర్స్‌కు మాత్రం గుర్తొచ్చే పేరు మా డాంగ్ సియాక్. అంతా డాన్ లీ అని పిలుచుకుంటారు. సౌత్ కొరియన్ యాక్షన్ సినిమాల్లో డాన్ లీ అంటే ఇష్టపడని వారుండరు.

అలాంటి డాన్ లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ స్పిరిట్‌లో విలన్‌గా చేస్తున్నాడని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్‌గానే కాకుండా తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్న డాన్ లీ నటించిన లేటెస్ట్ కొరియన్ డ్రామా సిరీసే ట్వెల్వ్.

సుమారు పదేళ్ల తర్వాత డాన్ లీ కే డ్రామా ప్రపంచంలోకి వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ఇది. సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ ట్వెల్వ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు కథ అందించిన వారిలో డాన్ లీ కూడా ఉండట...