Hyderabad, జూన్ 1 -- సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా శుభం. తెలుగు హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం మూవీకి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది.

శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, సమంత కూడా ఓ కీ రోల్‌లో ప్రేక్షకులను అలరించారు. మాతగా సమంత శుభం సినిమాలో క్యామియో రోల్ చేసింది. శుభం టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ భారీ అంచనాల మధ్య మే 9న థియేటర్లలో శుభం మూవీ విడుదలైంది. అయితే, శుభం సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగుందన...