భారతదేశం, జనవరి 2 -- తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే టీవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ (Beauty). ఈ సినిమా శుక్రవారం (జనవరి 2) నుంచి జీ5 ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిజానికి గతంలోనే ఈ సినిమా టీవీ ప్రీమియర్ అయింది. ఇప్పుడు మూడున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చింది. సాధారణంగా ప్రతి సినిమా మొదట ఓటీటీలోకి వచ్చిన తర్వాత టీవీలోకి అడుగుపెడుతుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం ...