భారతదేశం, జనవరి 6 -- ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన మరో వెబ్ సిరీస్ రాబోతోంది. టీవీఎఫ్ నిర్మించిన ఈ సిరీస్ పేరు స్పేస్ జెన్ - చంద్రయాన్. ఇది ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాల చుట్టూ తిరిగే సిరీస్. మంగళవారం (జనవరి 6) ఈ సిరీస్ టీజర్ ను జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఆ విశేషాలేంటో చూడండి.

జియోహాట్‌స్టార్ ఈ కొత్త ఏడాది తొలి నెలలోనే తీసుకొస్తున్న అద్భుతమైన వెబ్ సిరీస్ స్పేస్ జెన్ - చంద్రయాన్. గతేడాది డిసెంబర్ లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయగా.. తాజాగా ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో సిరీస్ లోని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేశారు. అందులో శ్రియ శరణ్ కూడా ఉండటం విశేషం. గడిచిన కొన్నేళ్లలో ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాలను ఈ సిరీస్ కళ్లకు కట్టబోతునట్లు టీజర్ చూస్తోంది. ఈ టీజర్ చాలా భావోద్వేగాలతో కూడిన రోలర్ కోస్టర్ లా సాగింది. జనవరి ...