Hyderabad, జూలై 4 -- యుగాంతం తర్వాత జరిగే కథలతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటోంది. గతేడాది తెలుగులో వచ్చిన కల్కి 2898 ఏడీ కూడా అలాంటిదే. ఇప్పుడో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. మే 9న థియేటర్లలో రిలీజైన కలియుగం 2064(Kaliyugam 2064) మూవీ రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగం సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

"ప్రపంచం ముగిసిన తర్వాత మీరు ఏమవుతారు? నమ్మకం, భయం, సర్వైవల్ మధ్య భవిష్యత్తులో జరిగే యుద్ధం చీకటిగా మారింది. కలియుగం జులై 11 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ పోస్టుల...