భారతదేశం, జూలై 4 -- కోర్టు డ్రామా థ్రిల్లర్లకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి రెస్పాన్సే దక్కుతుంది. రీసెంట్ గా కోర్ట్ మూవీ ఎంతటి సూపర్ హిట్ గా నిలిచిందో తెలిసిందే. అలాగే ఓటీటీలో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అదరగొడుతోంది. ఇప్పుడు అదే బాటలో ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్ పంచేేందుకు మరో కోర్టు డ్రామా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జులై 4) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఆ వెబ్ సిరీస్ 'గుడ్ వైఫ్'.

భర్తను కాపాడుకోవడం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించే భార్య కథే ఈ 'గుడ్ వైఫ్' వెబ్ సిరీస్. మంచి డ్రామాతో పాటు థ్రిల్ ను పంచే ఈ సిరీస్ శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ గా రూపొందిన ఈ సినిమా అదే ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్లూ ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

ప్రధానంగా తమిళ్ కోర్టు డ్రామాగా...