భారతదేశం, మే 30 -- తెలుగు కామెడీ డ్రామా మూవీ మారుతి న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి రావ‌డం గ‌మ‌నార్హం.

మారుతి న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం మూవీలో రావుర‌మేష్, ఇంద్ర‌జ, అంకిత్ కొయ్య, ర‌మ్య ప‌సుపులేటి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది. దాదాపు నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

మారుతి న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంలో లీడ్ రోల్‌లో త‌న కామెడీ టై...