Hyderabad, ఆగస్టు 15 -- తమిళం నుంచి ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన సినిమా తలైవన్ తలైవీ (Thalaivan Thalaivii). విజయ్ సేతుపతి, నిత్య మేనన్ నటించిన రొమాంటిక్ కామెడీ ఇది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకుపైగా వసూలు చేసింది. అలాంటి మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

విజయ్ సేతుపతి, నిత్య మేనన్ రొమాంటిక కామెడీ తలైవన్ తలైవీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 22న డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఒరిజినల్ తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ రానుంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "ఆగసవీరన్, పెరరసిలతో ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి. రెండుసార్లు.. తలైవన్ తలైవీ ఆగస్టు 22న ప్రైమ్ లో" అనే క్యాప్షన్ తో ఈ ...