భారతదేశం, ఆగస్టు 22 -- విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'తలైవన్ తలైవి' (Thalaivan Thalaivii) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఆగస్టు 22) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా 'సార్ మేడమ్' పేరుతో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తలైవన్ తలైవి శుక్రవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.

తలైవన్ తలైవి మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా జులై 25న థియేటర్లలో రి...