భారతదేశం, నవంబర్ 17 -- తమిళ వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'బైసన్'. ఈ మూవీతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబట్టుకున్నాడు ధ్రువ్. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం కోసం ధ్రువ్ చాలా చెమటోడ్చాడు. తండ్రి బాటలో సాగుతూ హిట్లు అందుకోవాలని చూస్తున్న ధ్రువ్ కు బైసన్ మూవీ మంచి జోష్ ఇచ్చింది.

ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ బైసన్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బైసన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (నవంబర్ 17) అఫీషియల్ గా ప్రకటించింది.

బైసన్ మూవీ మొదట తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఆ ...