భారతదేశం, జనవరి 28 -- కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన ఫ్యామిలీ డ్రామా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. జనవరి 13న సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుని.. బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) భారీ ధరకు సొంతం చేసుకుంది.

రవితేజ నటించిన మరో డిజాస్టర్ మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు హీరోయిన్లతో పండగకు వచ్చి సందడి చేసినా అతని రాత మారలేదు. మిగిలిన నాలుగు సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది.

తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జీ5 ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప...