భారతదేశం, అక్టోబర్ 30 -- రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన కాంతార ఛాప్టర్ 1 డిజిటల్ ప్రీమియర్ కానుంది. అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచిన ఈ మూవీ.. తాజాగా కర్ణాటకలోనూ మరో రికార్డును సొంతం చేసుకుంది.

కాంతార ఛాప్టర్ 1 మూవీ కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకూ ఏ సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ కర్ణాటక గ్రాస్ రూ.250 కోట్ల మార్క్ అందుకుంది. నిజానికి ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమా కనీసం రూ.200 కోట్లు కూడా దాటలేదు.

కేజీఎఫ్ 2లాంటి మూవీ కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసినా.. సొంత రాష్ట్రంలో గ్రాస్ మాత్రం కాంతార ఛాప్టర్ 1 కంటే చాలా తక్కువే. ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఈ ఏడాది...