భారతదేశం, జనవరి 5 -- ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ కృష్ణ వోడపల్లి నిర్మించిన మూవీ జిగ్రీస్. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు లాభాలు కూడా సంపాదించింది. ఈ సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కష్టాలను కళ్లకు కట్టే ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక నటించిన జిగ్రీస్ మూవీ మంగళవారం (జనవరి 6) నుంచే సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం ట్వీట్ చేసింది. "పవర్‌ఫుల్ సినిమాటిక్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.. జిగ్రీస్ జనవరి 6 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో వెల్లడించింది.

హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్ట్ చేసిన మూవీ జిగ్రీస్. కృష...