భారతదేశం, జనవరి 16 -- తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన మూవీ తేరే ఇష్క్ మే. గతేడాది నవంబర్ 28న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది.

బాలీవుడ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన తేరే ఇష్క్ మే (Tere Ishq Mein) సుమారు రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. గతేడాది నవంబర్ 28న థియేటర్లలోకి రాగా.. జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్లాట్‌ఫామ్ లోకి వెళ్లి మూవీని సెర్చ్ చేయగా.. ఆ డేట్ చూపిస్తోంది. ఈ సినిమా తెలుగులో అమర కావ్యంగా వచ్చింది. ఈ వెర్షన్ కూడా అదే రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే మ...