Hyderabad, మే 13 -- ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరుగాంచిన సిమ్రన్ నటించిన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు సూర్య నటించిన రెట్రో కూడా వచ్చినా.. ఆ సినిమాకు దీటుగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

తమిళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచిన మూవీ ఈ టూరిస్ట్ ఫ్యామిలీ. రూ.14 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. రెండు వారాల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మే 31 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులు వెల్లడించాయి.

నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకే తీసుకొద్దామని మొదట మేకర్స్ భావించినా.. తర్వాత థియ...